దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకుంటూ జోరు సాగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: పోలీసు కస్టడీకి సైఫ్ కేసు నిందితుడు
ఢిల్లీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికలను సమర్పించేందుకు ఢిల్లీ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే కాగ్ నివేదికను సమర్పించడంలో సీఎం అతిషి నేతృత్వంలోని ప్రభుత్వం జాప్యం చేసిందని ధర్మాసనం ఎత్తిచూపింది.
ఇటీవల కాగ్ రిపోర్టు లీక్ అయిందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు నష్టం జరిగిందని కమలనాథులు విమర్శించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై బీజేపీ ధ్వజమెత్తింది. అయితే బీజేపీ విమర్శలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇది కూడా చదవండి: Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం..
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది. అయితే ఈ సారి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్