Site icon NTV Telugu

Kejriwal: సీబీఐ అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్.. దర్యాప్తు సంస్థ వివరణ కోరిన హైకోర్టు

Kejeo

Kejeo

సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ స్పందనను న్యాయస్థానం కోరింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థనకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 17న విచారణకు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ను సీబీఐ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ముందు వాదించారు. అరెస్టు అక్రమమని పేర్కొంటూ వేసిన పిటిషన్‌లో పలు కీలక అంశాలను కేజ్రీవాల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం​ కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలనే సీబీఐ మళ్లీ రిపీట్‌​ చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్‌ వేయాలని సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: AP Deputy CM: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉండాలి..

ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. ఇక మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్‌ 26న సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

ఇది కూడా చదవండి: Marriage proposal: ఎఫైర్ పెట్టుకుని పెళ్లి చేసుకునేందుకు నిరాకరణ.. యువకుడి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన మహిళ..

Exit mobile version