Site icon NTV Telugu

Twitter handle blue tick: సీబీఐ మాజీ డైరెక్టర్‌కు హైకోర్టు జరిమానా..

M Nageswara Rao

M Nageswara Rao

సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది.. ట్విట్టర్ హ్యాండిల్ బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలని గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు నాగేశ్వరరావు.. అయితే, బ్లూ టిక్ పునరిద్ధరించాలని ట్విట్టర్ కోరిన పునరుద్ధరించకపోవడంపై మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ మాజీ డైరెక్టర్.. అయితే, ట్విట్టర్ లో బ్లూటిక్‌ను పునరుద్ధరించాలని తాజాగా హైకోర్టులో పిటిషన్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది.. అంతేకాదు.. సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర్ రావుకు రూ.10 వేలు జరిమానా విధించింది. మరోవైపు, కస్టమర్ల అభ్యంతరాలపై పరిమిత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు.

Read Also: Somireddy: వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Exit mobile version