NTV Telugu Site icon

Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

Kejriwal

Kejriwal

Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ అరెస్ట్ చేయడాన్ని ఢిల్లీ సీఎం సవాల్ చేశారు. కింది కోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇవ్వడంతో కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read Also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. క్లాస్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు..

కాగా, ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8వ తేదీ వరకు రోస్ అవెన్యూ కోర్టు జూలై 25న పొడిగించడం గమనార్హం. ఆయన ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది. అయితే, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ బృందం జూన్ 26వ తేదీన అరెస్టు చేయగా.. అంతకు ముందే, ఈ కేసులోనే మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.