NTV Telugu Site icon

Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..

Delhi Fire

Delhi Fire

ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది.  పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్  సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 50 మందిని రక్షించారు. అయితే చాలా మంది ఆచూకీ కనిపించడం లేదని తెలుస్తోంది. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉండటం… అది కూడా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవనంలో ఎలాంటి భద్రత ప్రమాణాలు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం వివిధ కంపెనీ కార్యాలయాలు ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ కార్యాలయంలోని ఉన్న మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. నిమిషాల వ్యవధిలోనే అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఫోరెన్సిన్ టీం  రంగంలోకి దిగింది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని … అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.