NTV Telugu Site icon

Kejriwal: బుధవారం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ.. రిలీఫ్ దొరికేనా?

Kejeo

Kejeo

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ మరియు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

ఇది కూడా చదవండి: Kolkata Doctor case: రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీని సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. బుధవారం తీర్పు రానుంది.

ఇదిలా ఉంటే ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ లభించొచ్చని ఆప్ ఆశలు పెట్టుకుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకుంది.

ఇది కూడా చదవండి: IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన మాజీ దిగ్గజం