Dussehra 2026: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ దసరాకు రావణ దహనంతో పాటు ‘‘బొద్దింకల’’ దహనం కూడా జరుగుతోంది. కొన్ని చోట్ల నకిలీ మందులు, ఎంఆర్‌పీల దోపిడీని ‘‘నేటి రావణుడి’’గా ప్రదర్శిస్తుంటే, మరొకొన్ని చోట్ల బొద్దింకల దిష్టిబొమ్మల్ని దహనం చేస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో రావణ దహనం జరగబోతోంది.రామ్ లీలా కమిటీ ఇంద్రప్రస్థ గత 25 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
ఢిల్లీలోని పీతాంపురాలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మల పక్కన బొద్దింక దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. మురికి, అపరిశుభ్రతకు దీనిని చిహ్నంగా అభివర్ణించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏ రాజకీయ పార్టీ, సమస్య కానీ ప్రేరణ కాదని కమిటీ చైర్మన్ అశోక్ గోయల్ చెబుతున్నారు. ఇటీవల, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీజేపీ నిరసనల్ని స్థానిక ఢిల్లీ ప్రజలు కన్నాట్‌ప్లేస్‌లో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే రావణుడితో పాటు బొద్దింక బొమ్మని కాల్చడం చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Delhi: The Shri Keshav Ramlila Committee is set to burn a unique 30-foot cockroach effigy alongside the traditional effigies of Ravana, Kumbhakarna, and Meghnad.
(Visuals from Netaji Subhash Place (NSP) grounds in Pitampura) https://t.co/METe6fojR8
— ANI (@ANI) October 20, 2026

