CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!

  • సీజేపీ నాయకులు రాంకా, దాస్‌లకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ షాక్..
  • జంతర్ మంతర్ నిరసనలకు సంబంధించి సమన్లు జారీ..
  • గురువారం మధ్యాహ్నం హాజరుకావాలని ఆదేశం..
Cjp

Cjp

CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు. బుధవారం బెయిల్ లభించడంతో వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇద్దరిపై రెండు కేసులు..

అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లపై జంతర్ మంతర్ నిరసనకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో, మరొకటి కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ.. దాస్, రాంకాలతో సహా సీజేపీ సభ్యులు అక్కడికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. బారికేడ్లు దాటి, ఓ ప్రైవేట్ సంస్థ ప్రాంగణం ద్వారా ఆ ప్రాంతంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

కన్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడం, ఇంట్లోకి అక్రమంగా ప్రవేవించడం, నేరపూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణలు నమోదైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండో ఎఫ్ఐఆర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటకం కలిగించడం, వారిపై దాడి చేయడం, పోలీసులకు గాయాలు కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

7 రోజుల తర్వాత బెయిల్..

అంతకుముందు, అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షల్ని ఉల్లంఘించి ప్రవేశించినందుకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందుగా 5 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత దీనిని మరో రెండు రోజులు పొడగించింది. బుధవారం వీరిద్దరికి సంబంధించిన బెయిల్ కేసు బుధవారం ఢిల్లీ హైకోర్టు చేరింది. హైకోర్టు సీజేపీ నేతల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేరే ప్రదేశాల్లో నిరసనకు అనుమతి ఉన్నప్పటికీ, ఆంక్షలు విధించిన జంతర్ మంతర్ వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. అంతకుముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేసి ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది. చివరకు బుధవారం సాయంత్రం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.