దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బయపెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మరో 103 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడం ఊరటనిచ్చే అంశమే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 14,27,439కు చేరుకోగా.. రికవరీ కేసులు 13,93,673కు పెరిగాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 24,402కు చేరింది.. ప్రస్తుతం రాజధానిలో యాక్టీవ్ కేసుల సంఖ్య 9364గా ఉందని.. గడచిన 24 గంటలలో 73,451 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది ఢిల్లీ సర్కార్.
కేసులు తగ్గాయి.. మృతుల సంఖ్య భయపెడుతూనే ఉంది..!
COVID 19