Site icon NTV Telugu

Sonia Gandhi: సోనియాగాంధీకి ఎదురుదెబ్బ.. పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండడంపై నోటీసు

Sonia Gandhi

Sonia Gandhi

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓటర్ ప్రత్యేక సర్వేపై కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు పబ్లిక్‌గానూ రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. భారత పౌరసత్వం రాక ముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు కావడంపై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సోనియాగాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 6, 2026కి వాయిదా వేసింది.

1983లో సోనియాగాంధీకి పౌరసత్వం వచ్చింది. కానీ 1980లోనే న్యూఢిల్లీ ఓటర్ లిస్ట్‌లో సోనియాగాంధీ పేరు ఉంది. అభ్యంతరాలు రావడంతో 1982లో తొలగించారు. తిరిగి 1983లో మళ్లీ ఓటర్ జాబితాలో పేరు చేర్చారని వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా సెప్టెంబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వికాస్ త్రిపాఠి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. బార్ అండ్ బెంచ్ ప్రకారం..సోనియా గాంధీ పేరు 1983 ఏప్రిల్‌లో మాత్రమే భారత పౌరసత్వం వచ్చింది. 1980లోనే న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఎలా చేర్చబడిందని త్రిపాఠి పేర్కొన్నారు. నకిలీ పత్రాలు ఉపయోగించారని ఆరోపించాడు.

క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ ప్రాథమిక వాదనలను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విన్నారు. అనంతరం సోనియగాంధీకి నోటీసు జారీ చేసింది. సోనియా గాంధీ, ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను తెలియజేయాలని నోటీసులో పేర్కొంది.

బీజేపీ నిలదీత..
ఇదిలా ఉంటే గతంలోనూ సోనియాగాంధీ పౌరసత్వాన్ని బీజేపీ ప్రశ్నించింది. 1983లో పౌరసత్వం వస్తే.. 1980లోనే ఓటర్ జాబితాలో ఎలా పేరు వచ్చిందని బీజేపీ నిలదీసింది. 1980లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారిక నివాసం సఫ్దర్‌జంగ్ రోడ్డులో ఉంది. ఆ చిరునామాతోనే సోనియాగాంధీ పేరు ఓటర్ జాబితాలో ఉంది. ఆ జాబితాలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ పేర్లు ఉన్నాయి. 1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను సవరించారని.. ఆ జాబితాలో సోనియా చేర్చారు. 1982లో నిరసనల తర్వాత జాబితా నుంచి పేరు తొలగించారు.. తిరిగి 1983లో మరోసారి ఆమె పేరు కనిపించింది.. వాస్తవంగా సోనియాకు అధికారికంగా 1983, ఏప్రిల్ 30న భారతీయ పౌరసత్వం వచ్చింది.. అలాంటిది అంతకముందే రెండు సార్లు ఓటర్ జాబితాలోకి పేరు ఎలా వచ్చిందని బీజేపీ ప్రశ్నించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని నిలదీసింది. ఇక రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత భారత పౌరసత్వాన్ని అంగీకరించడానికి ఆమెకు 15 సంవత్సరాలు సమయం ఎందుకు పట్టిందని బీజేపీ నిలదీసింది.

 

 

Exit mobile version