Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు, ఆయన్ను అరెస్ట్ చేయాలని 10 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. విపక్షాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పంజాబ్, హర్యానా, యూపీ నుంచి వచ్చే అనేక మంది ఈ సంస్థ నాయకులు ఆదివారం రెజ్లర్లకు మద్దతు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Read Also: Russia: రష్యాలో మరో ప్రముఖుడిపై దాడి.. ఉక్రెయిన్, అమెరికా పనే అని ఆరోపణ..
గతంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ సరిహద్దుల్లో రైతులు ఏడాది పాటు ఆందోళనలు చేశారు. వీటికి ఎస్కేఎం నాయకత్వం వహించింది. హర్యానా మంత్రి అనిల్ విజ్ రెజ్లర్లకు మద్దతు తెలిపారు, తాను మధ్యవర్తిత్వం వహిస్తానని, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారని, రెజ్లర్ల డిమాండ్లను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తెలిపారు. ఇప్పటికే బ్రిజ్ భూషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
రెజ్లర్లకు మద్దతుగా రైతులు ఢిల్లీ చేరుకుంటుండటంతో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ తో పాటు రాజధాని సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేట్లు ఏర్పాటు చేశారు. భద్రతా తనికీలు, పెట్రోలింగ్ పెంచారు. ఇదిలా ఉంటే తనపై ఆరోపణలు కాంగ్రెస్ కుట్ర అని బ్రిజ్ భూషన్ ఆరోపించారు.