Site icon NTV Telugu

Delhi Car Blast : LNJP ఆస్పత్రికి అమిత్‌షా.. గాయపడినవారికి పరామర్శ..

Amit Shah

Amit Shah

Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు గాయపడగా, వారిని సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.

Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!

ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. గాయపడిన వారిని చూడటానికి ఆయన ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అమిత్‌షా. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అమిత్‌ షా ఆదేశించారు. అనంతరం పేలుడు ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “రెడ్ ఫోర్ట్ సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న హ్యుందాయ్ i20 కారులో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పాదచారులు సహా పలువురు గాయపడ్డారు. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందింది. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్‌ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం NSG, NIA, FSL బృందాలు సమగ్ర విచారణను ప్రారంభించాయి. పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించేందుకు ఆదేశాలు జారీ చేశాం” అని అన్నారు.

“ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ తో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఘటనాస్థలంలో ఉన్నాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతుంది. ప్రజలకు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఆసుపత్రిలో గాయపడిన వారిని చూడడంతో పాటు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శిస్తాను,” అని స్పష్టం చేశారు. పేలుడు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ప‌లు అనుమానాస్పద కోణాల్లో విచారణను ప్రారంభించాయి. ప్రాంతమంతా భద్రత పెంచి, సుభాష్ మార్గ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.

Alluri Missing Girls : అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సేఫ్‌

Exit mobile version