Site icon NTV Telugu

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.28 కోట్ల బంగారు గడియారం సీజ్‌

Delhi Airport

Delhi Airport

Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు రూ. 28 కోట్లు వజ్రాలతో పొదిగిన బంగారం గడియారాన్ని సీజ్‌ చేశారు. దీంతో పాటు మరో ఆరు లగ్జరీ వాచ్‌లను, స్మగ్లింగ్‌ చేస్తున్న ప్రయానికుడిని అదుపులో తీసుకున్నారు. అయితే.. సీజ్‌ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారంతో సమానమని అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి పరిమితికి మించి ఎడిషన్ జాకబ్ & కో బిలియనీర్ వైట్ డైమండ్స్ వాచ్, ఆరు ఖరీదైన రోలెక్స్, పియాజెట్ వాచీలు, ఐఫోన్ 14, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్‌లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నీ దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడి ద్వారా భారత్‌కు అక్రమంగా రవాణా అవుతున్నాయని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. జాకబ్, కో వాచ్ విలువ రూ. 27 కోట్లు, 18కే వైట్ గోల్డ్ ఆభరణాలతో తయారు చేయబడిందని, రోలెక్స్ వాచీలు ఒక్కొక్కటి రూ. 15-20 లక్షలు కాగా, పియాజెట్ వాచ్ రూ.30 లక్షల కంటే ఎక్కువగా వుంటుందని తెలిపారు. రూ. 28 కోట్ల విలువైన ఈ గడియారం బంగారం- వజ్రాలు పొదిగారని అధికారులు తెలిపారు. అన్ని గడియారాలు, ఒక ఫోన్‌లతో సహా ఇవన్నీ గుజరాత్‌కు చెందిన నగల వ్యాపారిగా గుర్తించారు. నిందితుడిని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేసి కస్టమ్స్ చట్టం ప్రకారం వాచీలను స్వాధీనం చేసుకున్నామని కమీషనర్ (ఢిల్లీ కస్టమ్స్) జుబైర్ రియాజ్ కమిలి వెల్లడించారు.

Astrology : అక్టోబర్‌ 7, శుక్రవాం దినఫలాలు

Exit mobile version