Site icon NTV Telugu

AQI: అత్యంత ప్రమాదకర స్థాయి.. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు!

Delhi Air Pollution

Delhi Air Pollution

దేశరాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీపావళి పండగ నుంచి వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో సగటున 414 పాయింట్లుగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ఉంది. ఏక్యూఐ 400 మార్క్‌ను అధిగమించి తీవ్రమైన కేటగిరిలోకి చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామందిలో శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి.

Also Read: Unique Idea: నీ ఐడియా సూపర్ బాసూ.. ఒక్క కోతి కూడా దగ్గరకు రాదు!

అలీపూర్ 431, ఆనంద్ విహార్ 438, అశోక్ విహార్ 439, బురారీ 439 ,చాందిని చౌక్ 449,, ఐటిఓ 433, జహంగీర్ పూరి 446, నరేలా 437, నెహ్రూ నగర్ 440 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైంది. గాలి నాణ్యత 401-500 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-3(జీఆర్‌ఏపీ-3) ఆంక్షలు విధించింది. ఇక ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ విధానంలో విద్యార్థులకు పాఠాలను బోధించాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది.

Exit mobile version