NTV Telugu Site icon

Delhi : తింటుంటే భుజం తగిలిందని బాలుడిని చంపిన మైనర్..

Crime News

Crime News

ఇటీవల మైనర్లు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. క్షణికావేశంలో చేసే పొరపాట్లు వారిని నేరస్తులుగా మారుస్తున్నాయి.. తాజాగా ఢిల్లీ లో మరో దారుణం వెలుగు చూసింది.. 17ఏళ్ల బాలుడిని మరో మైనర్​ చంపేశాడు. మోమోలు తింటుండగా మొదలైన గొడవ ఇందుకు కారణం… ఈ ఘటనతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ ద్వారకాలోని డాబ్రి ప్రాంతంలోని రోహ్​తాష్​ నగర్​లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్​.. సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ మోమో తింటుండగా.. అతని భుజం ముఖానికి తగిలిందని వాదన పెట్టుకున్నాడు.. ఆ తర్వాత మాటా మాట పెరిగింది.. పెద్ద గొడవే జరిగింది.. కోపంతో రగిలిపోయిన బాలుడు అక్కడే ఉన్న కత్తిని తీసుకొని దారుణంగా పొడిచాడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 17ఏళ్ల మైనర్​ని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు..

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆ మైనర్​ దారుణంగా పొడి చంపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కినట్టు తెలిపారు. వాటి ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.. అయితే ఈ ఘటన జరుగుతున్నా అక్కడ ఉన్న ఎవరు ఆపే ప్రయత్నం చెయ్యలేదు.. స్నేహితులు కానీ, స్థానికులు కానీ ఆ బాలుడిని ఆపలేదు.. అందుకే తన కొడుకు చనిపోయాడని ఆ బాలుడి తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..