ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్ని గందరగోళ పరిస్థితుల్లో అక్కడి చిక్కకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా యోచినలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని భారత్ భావిస్తోందని ఆయన వెల్లడించారు.
ఉక్రెయిన్‌లో విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని ఆయన అన్నారు. భారతీయులను తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్ని పరిస్థితులతో అక్కడ చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు భయాపడాల్సిన పనిలేదని సురక్షితంగా అందరినీ తీసుకువస్తామని ఆయన అన్నారు.
