NTV Telugu Site icon

HimKavach: హిమాలయల్లో మన సైనికులకు రక్షణగా ‘‘హిమకవచ్’’.. డీఆర్డీఓ డెవలప్ చేసిన కొత్త దుస్తులు..

Himkavach

Himkavach

HimKavach: తీవ్రమైన చలి పరిస్థితుల్లో పనిచేసే సైనికులను రక్షించడానికి డీఆర్‌డీవో (DRDO) ‘హిమ్‌కవచ్’ దుస్తుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. 20 సెల్సియస్ డిగ్రీల నుంచి -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో పనిచేయడానికి రూపొందించిన మల్టీలేయర్ వ్యవస్థ కలిగిన దుస్తులు, ఇప్పుడు అన్ని వినియోగదారు ట్రయల్స్‌ని క్లియర్ చేసింది.

హిమకవచ్ వ్యవస్థ మల్టీ లేయర్‌లని కలిగి ఉంటుంది. ఇన్సులేషన్, శ్వాసక్రియతో పాటు సైనికులకు సౌకర్యంగా ఉండేందుకు రూపొందించబడింది. మాడ్యులర్ డిజైన్ వాతావరణాన్ని బట్టి మరిన్ని లేయర్లు జోడించడానికి లేదా తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. హిమాలయాల్లో పనిచేసే మన సైనికులకు ఇది చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే హిమాలయ ప్రాంతాల్లో అనూహ్యం వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.

Read Also: Off The Record: ఆ ఫైర్‌ బ్రాండ్‌లో కొన్నాళ్ల పాటు చల్లారిపోయిన ఫైర్‌ మళ్లీ అంటుకుందా..?

ప్రస్తుతం మన సైన్యం ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్ (ECWCS) ను ఉపయోగిస్తోంది. దీనిని కూడా డీఆర్డీవో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన 3 లేయర్ దుస్తుల్లో ఒకటి. మంచు పరిస్థితుల్లో, మంచులేని పరిస్థితుల్లో ECWCS ఇన్సులేషన్, వాటర్ ప్రూఫింగ్‌ని అందిస్తుంది.

మనుపటి వ్యవస్థతో పోలిస్తే ప్రస్తుతం ‘‘హిమకవచ్’’ విస్తృత రక్షణను అందిస్తుందని భావిస్తున్నారు. కఠిన ఉష్ణోగ్రత పరిస్థితుల్లో పనిచేయగలిగే సైనికులకు రక్షణను ఇస్తుంది. భారత సైనికులకు ఇతర సరిహద్దులతో పోలిస్తే హిమాలయ సరిహద్దులు చాలా కీలకం. అటు పాకిస్తాన్, ఇటు చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాము. ఈ ప్రాంతాల్లో పనిచేసే సైనికులకు ఇది చాలా ఉపయోగంగా ఉండబోతోంది. కొత్త దస్తుల వ్యవస్థ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Show comments