PM Modi: ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్(AI) వేగవంతమైన వృద్ధితో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని సరిగా పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలునిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జీ-20 దేశాలు సంయుక్తంగా పనిచేయాలని కోరారు. బుధవారం వర్చువల్‌గా జరిగిన జీ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేయాలని సూచించారు. ఏఐ ప్రజలకు చేరువకావాలి.. ఇది సమాజానికి సురక్షితంగా ఉండాలని ప్రధాని అన్నారు. డీప్‌ఫేక్ అనేది పెద్ద ఆందోళన అని ఆయన చెప్పారు.
Read Also: NIA: శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌పై దాడి కేసు.. పంజాబ్, హర్యాల్లో ఎన్ఐఏ దాడులు..
ఇటీవల కాలంలో ఏఐ డీప్ ఫేక్ వీడియోలు ఇండియాలో వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా నటి రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోను మార్ఫింగ్ చేసి రష్మికా వీడియోగా వైరల్ చేశారు. దీనిపై బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆందోళనను వెలిబుచ్చారు. ఇటీవల ప్రధాని గర్బా ఆడుతున్నట్లు డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. దీనిపై ఆయన మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని శుక్రవారం అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డీప్‌ఫేక్‌ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా సిబ్బంది ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయితే వెంటనే ప్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జీపీటి బృందాన్ని కోరినట్లు ప్రధాని వెల్లడించారు.