Site icon NTV Telugu

Mohammad Deepak: అయ్యో పాపం “మహ్మద్ దీపక్”..

Mohammad Deepak

Mohammad Deepak

Mohammad Deepak: ఉత్తరాఖండ్‌ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన దీపక్ కుమార్ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు అతడి పేరు అడిగితే ‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పుకోవడంతో ఒక్కసారి హీరో అయ్యారు. జనవరి 26న స్థానికంగా ఉన్న 70 ఏళ్ల ముస్లిం షాపు యజమానికి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సిద్ధ్‌బాలి బాబా ఆలయాన్ని పోలి ఉందని చెప్పారు.

Read Also: Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్‌లో నిందితుల అరెస్ట్!

అయితే, అహ్మద్ ను మతపరంగా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వివాద సమయంలో దీపక్ ఆ వృద్ధుడిని కాపాడాడు. ‘‘నా పేరు మహ్మద్ దీపక్’’ అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్ కుమార్ జిమ్‌కు వెళ్లి సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఏకంగా మెంబర్ షిప్ తీసుకున్నారు. దీపక్ ‘‘ఇండియా హీరో’’ అంటూ రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఇదే విధంగా రాహుల్ గాంధీ తాను సెల్యూట్ చేస్తానని దీపక్ అన్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు దీపక్ వ్యాపారంపైనే పెద్ద దెబ్బ పడింది. ఈ వివాదానికి ముందు దీపక్ జిమ్‌లో 150 సభ్యులు ఉంటే, ఇప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు. స్థానికులు జిమ్‌ను బహిష్కరించారు. జిమ్ రెంట్ రూ. 40,000, హోమ్ లోన్ ఈఎంఐ రూ. 16,000 ఇబ్బందికరంగా మారింది. ఆదాయం దాదాపుగా తగ్గిపోయింది. ఇంటి ఖర్చుల నిర్వహించడానికి తన తల్లి టీ స్టాల్‌పై ఆధారపడిందని చెబుతున్నాడు. మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దీపక్‌కు మద్దతు ఇచ్చిన వారిని తప్పుపట్టారు. పవిత్రమైన హిందూ పేరుకు ముందు మహ్మద్ పేరు పెట్టుకోవడంపై విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నా, స్థానికంగా మాత్రం వ్యతిరేక వ్యక్తమవుతోంది.

Exit mobile version