Site icon NTV Telugu

Rajya Sabha: నేడు రాజ్యసభలో ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న జేపీ నడ్డా

Rajya Sabha

Rajya Sabha

రాజ్యసభలో ఈరోజు ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. జాతీయ గీతం “వందేమాతరం” 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని మోడీ చర్చ ప్రారంభించారు. దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. ఇక మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 ఒంటి గంటకు చర్చను ప్రారంభించనున్నారు. ఇక్కడ కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!

ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వెలుపల.. లోపల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా నెలకొన్న ‘ఇండిగో సంక్షోభం’పై కూడా చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే అందుకు స్పీకర్ అనుమతించడం లేదు.

ఇది కూడా చదవండి: Akhanda 2 Release Date: అఖండ 2 డేట్ ఫిక్స్! అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే లోక్‌సభలో వందేమాతరం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని  అన్నారు. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి.. సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనే చేపట్టినట్లు పేర్కొన్నారు

 

 

 

 

Exit mobile version