NTV Telugu Site icon

Wayanad Landslide: వయనాడ్‌ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య.. 450 వరకు ఇళ్లు, భవనాలు ధ్వంసం

Wayanad Landslide

Wayanad Landslide

Wayanad Landslide: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో, మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటడిన వారందర్ని రక్షించినట్లు అంచనా వేశారు. ఇంకా 29 మంది చిన్నారులు అదృశ్యంగా ఉన్నారు. ముండక్కై, అట్టమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశంలో తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండక్కై, చురల్‌మాల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు. ఈ ప్రాంతాలకు వంతెనను నిర్మించాలని ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది. రేపు మధ్యాహ్నానికి బెలీ బ్రిడ్జి పూర్తి కానుంది.

Read Also: Lebanon-Israel War: తక్షణమే లెబనాన్‌ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక

కొండచరియలు విరిగిపడిన ముండక్కై, వెల్లరమల ప్రాంతాల్లో రెండు పాఠశాలలు, మెప్రాడి ప్రాంతంలోని రెండు పాఠశాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు గల్లంతైనట్లు డీడీఈ శశీంద్రవ్యాస్ వీఏ తెలిపారు. కొండచరియలు విరిగిన పరిడి ప్రాంతంలో ఈ రెండు పాఠశాలలు ఉన్నాయి. వేలరమల పాఠశాలలో 11 మంది చిన్నారులు తప్పిపోయారు. గల్లంతైన 29 మంది చిన్నారుల్లో నలుగురి మృతదేహాలను గుర్తించారు. పిల్లలందరి వివరాలను సేకరిస్తున్నారు.

మృతదేహం దొరికిన మూడు నిమిషాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. శిబిరాల్లో నివసిస్తు్న్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్లకు కారమయ్యే అవకాశం ఉండటంతో జంతువుల మృతదేహాలను తక్షణమే తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు సహా 450 భవనాలు దెబ్బతిన్నాయని ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ఎ కౌశిగన్ తెలిపారు. అనాథ శవాలకు ప్రోటోకాల్ ప్రకారం దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సాంబశివరావు తెలిపారు. 129 మొబైల్ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 59 ఉపయోగించబడుతున్నాయి. మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైంది. గుర్తించని మృతదేహాలను దహనం చేయడంపై గ్రామ పంచాయతీలే నిర్ణయం తీసుకుంటాయి

Show comments