మహారాష్ట్రలో కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 90 వేలను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 601 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 90,349కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 52,18,768కు పెరిగింది.. ఇక, కేవలంఓ ముంబైలో గత 24 గంటల్లో 1,037 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల్లో 37 మంది చనిపోయారు. ప్రస్తుతం ముంబైలో 27,649 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 14,708కు చేరింది.
మహారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు
COVID 19