Death Threats: “రాష్ట్రపిత” కామెంట్స్.. ముస్లిం మతగురువుకు చంపేస్తామని బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death threats to a Muslim cleric over Rashtra Pita remarks: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం మేధావులను, ముస్లిం మతపెద్దలను వరసగా కలిశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం నాయకులతో భేటీ కావడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 22న మోహన్ భగవత్ ఢిల్లీలోని ఓ మసీదుతో పాటు మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇలిమాసీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇలియాసీ, మోహన్ భగవత్ ను ‘రాష్ట్రపిత’గా సంబోధించారు.
ఓ హిందూ సంస్థ చీఫ్ ను ఇలాగా ముస్లిం మత గురువు రాష్ట్రపితగా అభివర్ణించడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర పిత కామెంట్స్ నేపథ్యంలో అహ్మద్ ఇలియాసీకి బెదిరింపులు ఎదురువుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ఫోన్లలో చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే తరుచుగా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read
- Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
- Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
ముస్లిం సమాజంలో ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను చెరిపేయడంతో పాటు దేశంలో శాంతి సామరస్యాలు పెంచేలా పలువురు ముస్లిం మేధావులను, మతగురువులను కలుస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇలియాసీతో మీటింగ్ సమయంలో అక్కడ ఉన్న మదరసా విద్యార్థులతో కూడా ముచ్చటించారు. భగవంతుడిని ఆరాధించే పద్ధతులు వేరుగా ఉంటాయి కానీ.. అతిపెద్ద మతం మానవత్వం అని భగవత్ అన్నారని ఇలియాసీ చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం కంప్యూటర్ నైపుణ్యాలను పెంచుకోవాలని భగవత్ సూచించినట్లు ఇలియాసీ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం.. ఇలియాసీ మాట్లాడుతూ.. నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ వచ్చారని..ఆయన ‘రాష్ట్ర పిత’, ‘రాష్ట్ర ఋషి’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వల్లే ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!