NTV Telugu Site icon

Dead Rat In Sambar: సాంబార్‌లో చనిపోయిన ఎలుక.. పాపులర్ రెస్టారెంట్‌లో ఘటన..వీడియో వైరల్..

Dead Rat In Sambar

Dead Rat In Sambar

Dead Rat In Sambar: ఇటీవల కాలంలో బయట ఆహారం తినాలంటే బయపడాల్సి వస్తోంది. వేలల్లో బిల్లులు తీసుకుంటూ కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్లు, హోటళ్లు విఫలమవుతున్నాయి. ఇటీవల ముంబైలో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలు ఉండటం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. గుజరాత్‌లో చిప్స్ ప్యాకెట్లో చనిపోయిన కప్ప కనిపించింది. సరైన నాణ్యత పాటించకపోవడంతో వినియోగదారులు అస్వస్థతకు గురైన సందర్భాలను చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఫుడ్ ఫాయిజనింగ్ కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

Read Also: Sunita Kejriwal: నా భర్తను కేంద్రం టెర్రరిస్టులా చూస్తోంది.. బెయిల్ వాయిదాపై కేజ్రీవాల్ భార్య..

ఇదిలా ఉంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్‌లో సాంబార్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. నికోల్‌లోని దేవి దోసా రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. కస్టమర్ తన సాంబార్‌లో చనిపోయిన ఎలుకను కనుగొన్నట్లు ఆరోపించారు. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంటూ రెస్టారెంట్ యజమానికి నోటీసులు జారీ చేసింది. చనిపోయిన ఎలుక సాంబార్‌లో ఉన్న వీడియోను వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలల్లో వ్యూస్ దక్కాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టడా, అందులో తెగిపోయిన మనిషి వేలు కనిపించింది.