NTV Telugu Site icon

Gujarat: పాపులర్ స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత

Gopal

Gopal

పిల్లలు మారం చేశారంటే.. వెంటనే కిరాణా షాపుల దగ్గరకు తీసుకెళ్లి స్నాక్స్ ప్యాకెట్లు కొంటారు. అవి మంచివో.. కాదో చెక్ చేయరు. స్నాక్స్ ప్యాకెట్ అయితే చాలు.. కొని తినేస్తారు. కొన్ని ప్యాకెట్లు స్పైసీగా ఉంటాయి. మరికొన్ని రుచే ఉండవు. అయినా కూడా పిల్లలు ఏవి పడితే అవి కొని తినేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటారా? గుజరాత్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పాపులర్ స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక ప్రత్యక్షమైంది. అది తిన్న బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా ప్రేమ్‌పూర్ గ్రామంలో ఓ బాలిక గోపాల్ నమ్కీన్ స్నాక్ ప్యాకెట్ తిని డయారేయాకు గురైంది. విరేచనాలు కారణంగా ఆస్పత్రి పాలైంది. గోపాల్ నమ్కీన్ ప్యాకెట్‌ ఇంటికి తెచ్చాక తల్లి.. బాలికకు తినిపించింది. తినిపిస్తుండగా హఠాత్తుగా చేతికి చచ్చిన ఎలుక కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అంతలోనే బాలిక విరేచనాలకు గురైంది. దావద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఇది కూడా చదవండి: Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..

భోజనం చేశాక.. పాపకు స్నాక్స్ ప్యాకెట్ తినిపిస్తుండగా ఎలుక ప్రత్యక్షమైందని.. వెంటనే వాంతులయ్యాయని బాలిక తండ్రి తెలిపారు. కుమార్తె అనారోగ్యానికి గురైందని.. డయారేయాతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం దావద్ ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంగా స్నాక్స్ ప్యాకెట్ తయారు చేసిన గోపాల్ నమ్కీన్‌పై ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..

Show comments