NTV Telugu Site icon

Corbevax: పిల్ల‌ల కోసం అత్య‌వ‌స‌ర అనుమ‌తి…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కోసం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావ‌డంతో వ్యాక్సినేష‌న్ వేగంగా అమ‌లుచేస్తున్నారు. 15 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వారి నుంచి వ‌యోవృద్ధుల వ‌ర‌కు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వ‌య‌సు వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపున్న పిల్ల‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇదే ఇప్పుడు అంద‌ర్ని ఆలోచింప‌జేసింది. స్కూళ్లు ఓపెన్ కావ‌డంతో పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు ఎలా పంపాలా అని ఆలోచిస్తున్నారు.

Read: Mystery: హంత‌కుడిని ప‌ట్టించిన ఆత్మ‌…

ఇక ఇదిలా ఉంటే, చిన్నారుల కోసం బ‌యోలాజిక‌ల్ ఇ సంస్థ త‌యారు చేసిన కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌కు డ్ర‌గ్స్ కంట్రోల్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా అత్య‌వ‌స‌ర అనుమ‌తులు మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వ‌య‌సువారికి అందించ‌నున్నారు. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే ఇదికూడా రెండో డోసుల వ్యాక్సిన్. 28 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల‌ను తీసుకోవాలి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 5 కోట్ల కార్బెవ్యాక్స్ డోసుల‌కు ఆర్డ‌ర్లు ఇచ్చినట్లు బ‌యోలాజిక‌ల్ ఇ సంస్థ తెలియ‌జేసింది.