Site icon NTV Telugu

Maharashtra: అమానుషం.. నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ మాక్ టెస్ట్‌లో కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి చెక్క కర్రతో చితకబాదాడు. అనంతరం పట్టించుకోకపోవడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ కావల్సిన కుమార్తె.. శవమైంది. ఈ విషాద ఘటన సాంగ్లి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు.. హత్యకు కారణం అదే!

ధోండిరామ్ భోసలే అనే వ్యక్తి మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె(17) 12వ తరగతి చదువుతోంది. ఇంకోవైపు నీట్ కోచింగ్ తీసుకుంటోంది. అయితే కుమార్తెకు నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంలో కుమార్తెను చెక్క కర్రతో నిర్దాక్షిణ్యంగా చితకబాదాడు. అనంతరం కుమార్తెను పట్టించుకోకుండా పాఠశాలలో జరుగుతున్న యోగా దినోత్సవ వేడుకలకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చేసరికి కుమార్తె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతికి కారణమైన తండ్రి, ప్రిన్సిపాల్ ధోండిరామ్ భోసలేను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ఇది కూడా చదవండి: 8 Vasanthalu : బ్రాహ్మిణ్ పాత్రతో కాశీ ‘కబేళా’లో రేప్ చేయిస్తారా?

Exit mobile version