NTV Telugu Site icon

Darshan: దర్శన్‌కి కోపం ఎక్కువ.. నా పరిమితుల్లో ఉండేదాన్ని.. నటి వ్యాఖ్యలు..

Anusha Rai

Anusha Rai

Darshan: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సహ నటి పవిత్ర గౌడతో సహజీవనంలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి(33) సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడంతో, అతను హత్యకు గురయ్యాడు. దర్శన్, అతని సన్నిహితులు స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్రలతో కొడుతూ, కరెంట్ షాక్ ఇస్తూ బాధితుడిని టార్చర్ చేశారు. ఇదే కాకుండా స్వామి వృషణాలపై తీవ్రగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

Read Also: Madhya Pradesh: అమానుషం.. మహిళను కర్రలతో కొడుతుండగా వీడియో తీస్తున్న జనాలు

ఇదిలా ఉంటే దర్శన్ గురించి మరో సహనటి అనుషా రాయ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హత్యలో దర్శన్ ఉండటాన్ని నమ్మలేకపోతున్నానని, అతను ఎంతో వినయంగా, కేరింగ్‌గా ఉంటారని అన్నారు. అయితే, ఆయనకు కోపం సమస్యలు ఉన్నాయని, కానీ చాలా వినయంగా ఉంటాడని, మంచివాడని చెప్పింది. అతను ప్రతీదానికి కోపం తెచ్చుకోడు, ప్రజలు అతడితో జాగ్రత్తగా మాట్లాడుతారు, నేను అతడితో మాట్లాడినప్పుడు నా పరిమితుల్లో ఉంటానని అనూషా రాయ్ చెప్పారు. పవిత్రతో దర్శన్‌కి ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని చెప్పారు. దర్శన్ భార్య, కుమారుడిపై వస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దర్శన్‌కి ఇంకా శిక్షపడలేదని, చట్టం తన పని తానున చేసుకుంటుందని చెప్పారు.