NTV Telugu Site icon

Durga Puja In Kolkata: పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజపై కొనసాగుతున్న డైలమా

Bengal

Bengal

Durga Puja In Kolkata: దుర్గా పూజకు కేవలం మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ సంవత్సరం పండుగ ఉత్సాహం తగ్గినట్లు అనిపిస్తుంది. బెంగాలీలకు దుర్గాపూజ అనేది ఒక పండుగ మాత్రమే కాదు- ఇది వారి గుర్తింపు. అయితే, ఈ సంవత్సరం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తరువాత తీవ్ర సంక్షోభం ఏర్పడింది.

Read Also: Musi River Area: చైతన్యపురి, సత్యనగర్ లో ఉద్రిక్తత.. మార్కింగ్ ప్రక్రియపై ఆందోళన..

ఆగస్టు 9వ తేదీన ట్రైనీ డాక్టర్ హత్యతో కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతుంది. దుర్గా పూజ ఉత్సవాలను తిరిగి నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాత మాత్రమే ఉత్సవాల్లో పాల్గొంటామని కోల్‌కతా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సంఘీభావంగా ఈ వేడుకలను విరమించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

Read Also: Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..

కాగా, ప్రతి సంవత్సరం బెంగాల్ అంతటా దుర్గా పూజ నిర్వహించే కమ్యూనిటీ క్లబ్‌లకు రాష్ట్ర గ్రాంట్ అందించబడుతుంది. ఈ ఏడాది ఆ గ్రాంట్ ను రూ.85 వేలకు పెంచారు. అయితే, ఆర్జీ కర్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దుర్గా పూజ కమిటీలు ప్రభుత్వ సహాయన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ లోని మహాజాతి నగర్ దుర్గా ఉత్సబ్ కమిటీ, నేతాజీ నగర్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ, శక్తి సంఘ్, అపనాదర్, అబాహానీ క్లబ్, భద్రకాళి బౌథాన్ సంఘ్ దుర్గా పూజ కమిటీల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ను తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.