Site icon NTV Telugu

BJP MLA: ప్రధాని మోడీకి రక్తంలో లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే..?

Bjp Mla

Bjp Mla

BJP MLA: డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా శనివారం ప్రధాని నరేంద్రమోడీకి తన సొంత రక్తంతో లేఖ రాశారు. గూర్ఖాల డిమాండ్లను పరిష్కరించాలని, గూర్ఖా సంఘం సమస్యలపై ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 10, 2014న సిలిగురి సమీపంలో ఖప్రైల్‌లో జరిగిన బహిరంగ సభ్యలో ప్రధాని మోడీ ఇచ్చి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో హైలెట్ చేశారు.

Read Also: Bachelor Party : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కన్నడ కామెడీ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

చాలా ముఖ్యమమైన విషయం మీ దృష్టికి తీసుకురావడానికి సొంత రక్తంతో లేఖ రాశానని, గూర్ఖాల సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారం కనుగొంటామని, గూర్ఖాల్లో 11 విస్మరించబడిన వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇది ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో జింబా పేర్కొన్నారు. 2009, 2014, 2019 లో బీజేపీ సంకల్ప పత్రంలో ప్రతిధ్వనించిన ‘‘”గూర్ఖా కా స్వప్నా, మేరా స్వపనా’’ అనే నినాదం ద్వారా మాకు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, భారతీయ గూర్ఖాలకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైందని, గౌరవనీయులైన ప్రధాని నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని, ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేర్చాలని లేఖలో ఎమ్మెల్యే కోరారు.

Exit mobile version