NTV Telugu Site icon

Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..

Jarkhand

Jarkhand

Jarkhand: మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సర్వ సాధారణమైపోయాయి. ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళిత, గిరిజనుల్లోని మహిళల్లో ఈ దాడులు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసిన దుండగులు.. వారం రోజుల పాటు వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు.

Read also: Rishab Shetty : కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి..?

జార్ఖండ్ రాష్ట్రం లాతేహర్‌ జిల్లా బరవాడీహ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఇద్దరు దళిత బాలికలు కొంత కాలం నుంచి కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ జిల్లా ఎస్పీ దీనిపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు బాలికల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాలికలను గార్వా ప్రాంతానికి చెందిన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీంలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం బాలికలను దుండగుల చెర నుంచి విడిపించారు. ఈ క్రమంలో పోలీసులతో బాధితులు పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. నలుగురు దుండుగులు తమను కిడ్నాప్ చేశారని చెప్పారు. వారం రోజుల పాటు తమను ఓ ఇంట్లో బంధించారని తెలిపారు. ఆ సమయంలో పలుమార్లు తమపై లైంగిక దోపిడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.