Site icon NTV Telugu

Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు

Untitled 6

Untitled 6

Cyclone Tej: తేజ్ తుఫాన్ తీవ్రత తారా స్థాయికి చేరనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. భారత వాతావరణ కేంద్రం (IMD) సమాచారం ప్రకారం.. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నానికి తేజ్ తుఫాన్ తీవ్రతరంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తేజ్‌ తుఫాను కారణంగా అతి వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని.. వేచే ఈదురు గాలుల వేగం గంటకు గరిష్టంగా 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. కాగా ఈ ఈదురు గాలుల వేగం గంటకు 89 కిలోమీటర్లు నుంచి 117 కిలోమీటర్ల గరిష్ఠానికి చేరితే దాన్ని తీవ్ర తుఫానుగా పరిగణిస్తామని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం గుజరాత్‌పై అధికంగా ఉంటుందని..

Read also:plane crash: విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం ఇదే…

అయితే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నందున గుజరాత్ తూర్పు ప్రాంతంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. మొదట ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి అది క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు ఆ తుఫాను కాస్త తీవ్రస్థాయికి చేరుతోందని ఐఎండీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్‌లో రేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను గుజరాత్ ను అతలాకుతలం చేసింది. ఇప్పుడు మరోసారి తేజ్ తుఫాను గుజరాత్ ను తాకబోతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టడానికి అనుసరిస్తున్న ఫార్ములా ప్రకారం దీనికి ‘తేజ్’ అని నామకరణం చేశారు.

Exit mobile version