Site icon NTV Telugu

Cyclone Senyar: దక్షిణాది వైపు దూసుకొస్తున్న సెన్యార్ తుఫాను.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Cyclone Senyar

Cyclone Senyar

దక్షిణాదికి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. సెన్యార్ తుఫాన్ దక్షిణాది వైపు దూసుకొస్తోంది. మలక్కా జలసంధింపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం తుఫాన్ ‘సన్యార్’గా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Deepti Chaurasia: ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

24 గంటల పాటు తుఫాన్ బలాన్ని నిలుపుకుంటుందని.. అనంతరం క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ కారణంగా రాబోయే రోజుల్లో తమిళనాడు, కేరళ, మాహే, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉంటే తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్నం జిల్లాల్లో కురిసిన వర్షాలతో వరదలను తలపిస్తున్నాయి.

నవంబర్ 23-28 మధ్య అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. 24 గంటల్లో 105–204 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గాలి వేగం గంటకు 35–45 కి.మీ.గా ఉంటుందని పేర్కొంది.

సమద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 28 వరకు ఈ హెచ్చరికలు ఉంటాయని తెలిపారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Haryana: విషాదం.. బాస్కెట్‌బాల్ పోల్ విరిగి క్రీడాకారుడు మృతి

Exit mobile version