NTV Telugu Site icon

Cyclone Mocha: దిశ మార్చుకున్న “మోచా తుఫాను”.. బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదలిక

Mocha Cyclone

Mocha Cyclone

Cyclone Mocha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుఫాన్’ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఒడిశాతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గతంలో భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోచా తుఫాన్ దిశ మార్చుకుని, మయన్మార్(బర్మా) వైపు కదిలే అవకాశం ఉందని, ఇది గంటకు 148 కిలోమీటర్ వేగంతో ‘ చాలా తీవ్రమైన తుఫాన్’గా మారే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని, ఇది సాయంత్రం నాటికి బలపడి వాయుగుండంగా, ఆ తరువాత మోచా తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం నాటికి ఇది తీవ్రరూపం దాల్చి గంటకు 148 కిలోమీటర్ల వేగంతో తీవ్రతుఫాన్ గా మారే అవకాశం ఉందని, ఇది యాంగూన్ సమీపంలోని మయన్మార్ తీరం వైపు వెళ్తుందని ఐఎండీ మంగళవారం తెలిపింది.

Read Also: Hyderabad : హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు

ఇది మయన్మార్ తీరం వైపు వెళ్తోందని, ఇది తుఫాన్ గా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. మెచా మే 11 వరకు ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది క్రమంగా పుంజుకుని ఉత్తర- ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు, చిన్న ఓడలు, పడవలు ఆగ్నేయ మరియు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

మే 9 నుండి 11 వరకు అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు గంటకు 45-55 కి.మీ వేగంతో 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం సాయంత్రం నుండి 50-60 కి.మీ నుండి 70 కి.మీ వరకు మరియు బుధ మరియు గురువారాల్లో 55-65 కి.మీ నుండి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మే 12, 13 తేదీల్లో గాలుల వేగం గంటకు 100-110 కి.మీ. ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.