Site icon NTV Telugu

Congress : రేపు సీడబ్ల్యూసీ మీటింగ్‌.. దానిపై చర్చ..

CWC Meeting

CWC Meeting Tomorrow at Delhi.

దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి పాలైంది. మిగిలిన 4 రాష్ట్రాల విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. త‌న పాల‌న‌లో ఉన్న పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓట‌మిపాల‌య్యారు.

అన్నింటా ఓట‌మి నేప‌థ్యంలో…ఈ ఓట‌మికి బాధ్యులు ఎవ‌రు అంటూ పార్టీ సీనియ‌ర్లు కాస్తంత గ‌ట్టిగానే గ‌ళం విప్పారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ ఆజాద్ స్వరం రీసౌండ్ ఇచ్చింది. ఫ‌లితంగా సీడ‌బ్ల్యూసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్పడింది. ఆదివారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని ఏఐసీసీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వెలువడింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగే సీడ‌బ్ల్యూసీ భేటీలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాలపై పార్టీ చ‌ర్చించ‌నుంది.

Exit mobile version