Site icon NTV Telugu

Ladakh: ‘‘సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని తగలబెట్టే యత్నం’’.. లడఖ్‌లో హింస, లేహ్‌లో కర్ఫ్యూ..

Curfew Imposed In Leh

Curfew Imposed In Leh

Ladakh: లడఖ్‌కు రాష్ట్రహోదా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.

Read Also: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!

ఈ ఘర్షణల్ని లెఫ్టినెంట్ గవర్నర్ కుట్రగా అభివర్ణించారు. హింసలో పాల్గొన్న అందరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరసన తెలుపుతున్న గుంపు హఠాత్తుగా హింసకు పాల్పడ్డారు. లడఖ్‌లోని పోలీస్ వాహనాలను కాల్చారు, బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన తర్వాత ఆందోళనకారులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. లడఖ్‌లో నలుగురు మరణాలకు కారణమైన, నిరసనల్ని ప్రేరేపించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంపు వాహనం లోపల సీఆర్‌పీఎఫ్ వాహణంలో సిబ్బందిని తగలబెట్టే ప్రయత్నం చేశారు.

అయితే, తమపైనే భద్రతా బలగాలు బలప్రయోగం చేశాయని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోళనకారుల దాడిలో అనేక మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లేహ్‌లో కర్ఫ్యూ విధించారు. గత కొన్నాళ్ల నుంచి లడఖ్ ప్రాంతంలో కొందరు నాయకులు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత 2019లో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైంది.

Exit mobile version