BJP 5th List: బీజేపీ 5వ జాబితా రిలీజ్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP 5th List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారితో బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరుపున పోటీలో దిగనుంది. హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి ఈమె పోటీ చేస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిన్ గంగోపాధ్యాయ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆదివారం రోజు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కి కూడా జాబితాలో చోటు లభించింది.
Read Also: MI vs GT: రాణించిన గుజరాత్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
అంతా అనుకుంటున్నట్లు వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన జితిన్ ప్రసాదను నిలబెట్టింది. ఇదిలా ఉంటే, వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్ పూర్ నుంచి బరిలో నిలిపింది. సందేశ్ ఖాలీలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఉద్యమానికి నాయకత్వం వహించిన రేఖా పాత్రకు బహీర్‌హాట్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన అర్జున్ సింగ్, తపస్ రాయ్ వరుసగా బరాక్‌పూర్, కోల్‌కతా నార్త్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్‌ను మీరట్ లోక్‌సభ స్థానంలో బీజేపీ పోటీకి దింపింది. గత వారం బీజేపీలో చేరిన కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందిన అమృతా రాయ్‌ని కృష్ణానగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై ఆమె పోటీ చేయనున్నారు.
ఐదవ జాబితాలో భాగంగా ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, ఒడిశా, మిజోరాం, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జార్ఖండ్‌లోని పలు స్థానాలు ఉన్నాయి.
ప్రముఖులు ఎక్కడి నుంచి పోటీ..?:
కంగనా రనౌత్- మండీ (హిమాచల్ ప్రదేశ్)
నవీన్ జిందాన్- కురుక్షేత్ర(హర్యానా)
జితిన్ ప్రసాద- పిలిభిత్(ఉత్తర్ ప్రదేశ్)
మేనకా గాంధీ-సుల్తాన్ పూర్(ఉత్తర్ ప్రదేశ్)
అభిజిత్ గంగూలీ- తుమ్లూక్ (పశ్చిమ బెంగాల్)
అమృతా రాయ్- కృష్ణానగర్ (పశ్చిమ బెంగాల్)
గిరిరాజ్ సింగ్- బెగుసరాయ్(బీహార్)
రవి శంకర్ ప్రసాద్-పాట్నా సాహిబ్(బీహార్)
సీతా సొరెన్-డుంకా( జార్ఖండ్)
జగదీష్ షెట్టర్-బెల్గాం(కర్ణాటక)
ధర్మేంద్ర ప్రధాన్-సంబల్‌పూర్( ఒడిశా)
సంబిత్ పాత్ర-పూరి(ఒడిశా)
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!