NTV Telugu Site icon

BJP 5th List: బీజేపీ 5వ జాబితా రిలీజ్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి చోటు..

Kangana

Kangana

BJP 5th List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారితో బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరుపున పోటీలో దిగనుంది. హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి ఈమె పోటీ చేస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిన్ గంగోపాధ్యాయ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆదివారం రోజు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కి కూడా జాబితాలో చోటు లభించింది.

Read Also: MI vs GT: రాణించిన గుజరాత్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

అంతా అనుకుంటున్నట్లు వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన జితిన్ ప్రసాదను నిలబెట్టింది. ఇదిలా ఉంటే, వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్ పూర్ నుంచి బరిలో నిలిపింది. సందేశ్ ఖాలీలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఉద్యమానికి నాయకత్వం వహించిన రేఖా పాత్రకు బహీర్‌హాట్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన అర్జున్ సింగ్, తపస్ రాయ్ వరుసగా బరాక్‌పూర్, కోల్‌కతా నార్త్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్‌ను మీరట్ లోక్‌సభ స్థానంలో బీజేపీ పోటీకి దింపింది. గత వారం బీజేపీలో చేరిన కృష్ణానగర్‌ రాజకుటుంబానికి చెందిన అమృతా రాయ్‌‌ని కృష్ణానగర్‌ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై ఆమె పోటీ చేయనున్నారు.

ఐదవ జాబితాలో భాగంగా ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, ఒడిశా, మిజోరాం, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జార్ఖండ్‌లోని పలు స్థానాలు ఉన్నాయి.

ప్రముఖులు ఎక్కడి నుంచి పోటీ..?:

కంగనా రనౌత్- మండీ (హిమాచల్ ప్రదేశ్)
నవీన్ జిందాన్- కురుక్షేత్ర(హర్యానా)
జితిన్ ప్రసాద- పిలిభిత్(ఉత్తర్ ప్రదేశ్)
మేనకా గాంధీ-సుల్తాన్ పూర్(ఉత్తర్ ప్రదేశ్)
అభిజిత్ గంగూలీ- తుమ్లూక్ (పశ్చిమ బెంగాల్)
అమృతా రాయ్- కృష్ణానగర్‌ (పశ్చిమ బెంగాల్)
గిరిరాజ్ సింగ్- బెగుసరాయ్(బీహార్)
రవి శంకర్ ప్రసాద్-పాట్నా సాహిబ్(బీహార్)
సీతా సొరెన్-డుంకా( జార్ఖండ్)
జగదీష్ షెట్టర్-బెల్గాం(కర్ణాటక)
ధర్మేంద్ర ప్రధాన్-సంబల్‌పూర్( ఒడిశా)
సంబిత్ పాత్ర-పూరి(ఒడిశా)