NTV Telugu Site icon

CSIR-UGC-NET: జూన్ 25న జరగాల్సిన CSIR-UGC-NET పరీక్ష వాయిదా..

Ugc Net

Ugc Net

CSIR-UGC-NET: వరసగా పేపర్ లీకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నీట్, యూజీసీ-నెట్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ఈ లీకులన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27 మధ్య జరగాల్సిన CSIR-UGC-NET పరీక్షను అనివార్య పరిస్థితులతో పాటు లాజిస్టిక్ సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ శుక్రవారం తెలిపింది. జాయింట్ CSIR యూజీసీ నెట్ అనేది భారతీయ యూనివర్సిటీలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) మరియు లెక్చర్‌షిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే పరీక్ష. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటుంది.

Read Also: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..

వరస పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈనెల 18న జరిగిన యూజీసీ-నెట్ పరీక్షను తర్వాతి రోజు అంటే బుధవారం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ రద్దు చేసింది. డార్క్‌వెబ్‌లో ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేంద్రం తెలిపింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ లీకులు వెనక ఉన్నవారిని విడిచిపెట్టేలేది లేదని, విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్మాణం, పనితీరు, పారదర్శకత కోసం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.