NTV Telugu Site icon

Cred CEO Kunal Shah: ఆ సంస్థ సీఈవో జీతం తెలిస్తే షాకే.. ఏంటి సారు ఇది..?

Kunal Shah

Kunal Shah

Cred CEO Kunal Shah: ఓ కార్పొరేట్‌ సంస్థ సీఈవో అనగానే లక్షలకు లక్షల జీతం.. కావాల్సినన్ని సదుపాయాలు.. ఆఫీస్‌లో ప్రత్యేక చాంబర్‌, ఉండడానికి ప్రత్యేకమైన బంగ్లా.. స్పెషల్‌ కార్లు.. అబ్బో.. బాస్‌ ఆఫీసుకు వస్తుండంటేనే అక్కడ హడావిడి.. ఇలా ఎంతో హంగామా ఉంటుంది.. కానీ, ఓ సంస్థ సీఈవో జీతం తెలస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే.. సార్‌ ఏంటి? సారు రేంజ్‌ ఏంటి..? తీసుకుంటున్న జీతం ఏంటి? అని నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిందే.. ఎందుకంటే.. కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసే.. కిందిస్థాయి ఉద్యోగుల జీతం కూడా కనీసం రూ.20 వేల పైనే ఉంటుంది.. కానీ, ఆ సంస్థ సీఈవో జీతం మాత్రం కేవలం 15 అంటే.. రూ.15 వేలు మాత్రమే.. ఇంతకీ ఎవరా? వ్యక్తి.. రూ.15 వేలతో ఎలా బతికేస్తున్నాడు అనే వివరాల్లోకి వెళ్తే..

Read Also: Khushbu Sundar: సినీనటి ఖుష్బూకు కీలక పదవి.. మోదీకి థాంక్స్ చెబుతూ ట్వీట్..

అయనే.. భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా.. ఆయన నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు కునాల్‌ షా.. ఈ చర్చ సందర్భంగా నెటిజన్లు ఆయనకి అనేక ప్రశ్నలు వేశారు.. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.. ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘నా శాలరీ నెలకు రూ.15 వేలే అని సమాధానం ఇచ్చారు.. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ స్థాయిలో జీతభత్యాలు తీసుకోవడం సబబు కాదని భావిస్తున్నానన్న ఆయన.. గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతోంది అంటూ బదులిచ్చారు.. మొత్తంగా సీఈవో కునాల్‌ షా.. ఆ నెటిజన్‌తో చేసిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు.. సారు అంత తక్కువ జీతంతో మీరు ఎలా బతికేస్తున్నారు అని అడిగేస్తున్నారు.. కొందరు సీఈవోపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ ప్రకటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Read Also: Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు

ఇతర టెక్ సంస్థల జీఈవోల జీతం ప్యాకేజీ విషయానికి వస్తే.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంవత్సరానికి 12 బిలియన్ డాలర్లను ఇంటికి తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంవత్సరానికి 242 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ 2022లో 99.4 మిలియన్ డాలర్ల జీతం ప్యాకేజీని అందుకున్నాడు. కానీ, ఇప్పుడు భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా జీతమే చర్చగా మారింది.