Site icon NTV Telugu

Monu Manesar: వివాదస్పద గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్..

Monu Manesar

Monu Manesar

Monu Manesar: వివాదాస్పద గోసంరక్షుడు మోనూ మనేసర్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తలను హత్య చేశాడని, జూలై నెలలో హర్యానాలో నూహ్ ప్రాంతంలో మతకలహాలు పెరిగేందుకు కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హర్యానాలో కారులో ఇద్దరు ముస్లింల శవాలు కాలిపోయన స్థితితో బయటపడ్డాయి. ఈ ఘటనలో మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.

రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాకు చెందిన నసీర్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ జరిగింది. మరసటి రోజు హర్యానాలోని లోహారులో కారులో వీరిద్దరి శవాలను గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ కేసులో మానెసర్ ని రాజస్థాన్ పోలీసులకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. సమాచార సాంకేతిక చట్టంలోని బెయిలబుల్ సెక్షన్ల కింద హర్యానా పోలీసులు మంగళవారం మానేసర్‌ను అదుపులోకి తీసుకున్నారని హర్యానా పోలీసు వర్గాలు తెలిపాయి.

Read Also: Khalistan: భారత ఎంబసీని మూసేయండి.. కెనడాలో ఖలిస్థాన్ గ్రూప్ హెచ్చరిక

జూలై నెలలో హర్యానాలోని నూహ్ లో పెద్ద ఎత్తున మతకలహాలు జరిగాయి. హిందువులు ఊరేగింపుగా వెళ్లుతున్న సమయంలో కొన్ని ముస్లిం వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనో ఓ కానిస్టేబుల్ తో సహా ఆరుగురు మరణించారు. ఈ యాత్రలో మానేసర్ పాల్గొంలటున్నాడనే సమాచారంతో కొందరు దాడికి తెగబడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు. ఈ ఘటన అనంతరం హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చూపించింది. అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను, అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది.

Exit mobile version