Viral Video: హర్యానా ఫరీదాబాద్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూరాయి. దీంతో భయపడిన మహిళ, ఇంట్లోని కప్‌బోర్డులో దాక్కుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన పశువులు బయటకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండు గంటల పాటు సాయం కోసం సదరు మహిళ కప్‌బోర్డులోనే ఉంది.
Read Also: US visa: ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా
బుధవారం జరిగిన ఈ సంఘటనలో, డబువా కాలనీలోని సీ-బ్లాక్‌లోని ఒక ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూసుకువచ్చాయి. రాకేష్ సాహు తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అతడి భార్య సప్న ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఆ సమయంలో ఆమె పిల్లలు, ఆమె అత్త ఇంట్లో లేరు. ఆమె అత్త మార్కెట్‌కి వెళ్లారు.
అకస్మాత్తుగా, ఒక ఆవు నేరుగా వారి బెడ్రూంలోకి రావడంతో సప్న భయపడి పరిగెత్తి, కప్‌బోర్డులో దాక్కుంది. దాదాపు రెండు గంటల పాటు ఆమె సహాయం కోసం అరిచింది. ఆవు, ఎద్దు రెండు కూడా బెడ్రూంలోని మంచంపై ఉండటం వీడియోలో గమనించవచ్చు. చివరకు ఇరుగుపొరుగు వారు శబ్దాలు విని, పశువుల్ని ఇంటి నుంచి పారద్రోలడానికి పటాకులు పేల్చారు, నీరు విసరడం వంటివి చేశారు, వాటిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే, అవి ఎంతసేపటికి కూడా అందులోంచి కదలేదు. చివరకు పొరుగున ఉండే ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకువచ్చాడు. కుక్క బిగ్గరగా అరవడంతో భయపడి పశువులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాయి.
https://twitter.com/ag_Journalist/status/1905182263803056450
