దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాజాగా 12 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మరో 23 మంది మరణించారు. 8,148 మంది కోలుకున్నారు.
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4,32,83,793 మంది వైరస్ బారినపడ్డారు దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,26,90,845కు చేరింది. మృతుల సంఖ్య 5,24,840గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.16 శాతంగా ఉంది.భారత్‌లో శుక్రవారం 14,99,824 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,00,42,768 కోట్లకు చేరింది. మరో 4,84,924 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు
దేశ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు ప్రాంతాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఎక్కువగా కేసులు నమోదు అవుతుండడంతో.. అక్కడి ప్రభుత్వం కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలని కోరుతోంది. ఇక మహారాష్ట్రలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక్క ముంబై నగరంలోనే సగం కేసులు ఉంటున్నాయి.
Heeraben Modi Birthday: శతవసంతంలోకి ప్రధాని తల్లి.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
