Site icon NTV Telugu

Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 12,847 కేసులు

Pti02072022000151a 1 1084287 1645593541

Pti02072022000151a 1 1084287 1645593541

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాాజాగా పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,847 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,063గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి 14 మంది మరణించారు.

కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4,32,70,577 వ్యాధి బారినపడ్డారు. దీంట్లో 5,24,817 మరణించగా..4,26,82,697 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7985 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో రోజూవారీ పాజిటివిటీ రేటు 2.47గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.65 శాతంగా ఉంది ప్రస్తుతం దేశంలో 195.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను అర్హులైన ప్రజలకు అందించారు.

దేశ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు ప్రాంతాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో గడిచిన 10 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కోవిడ్ రూల్స్ తప్పక పాటించాలని కోరుతోంది. ఇక మహారాష్ట్రలో రోజూ 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఒక్క ముంబై నగరంలోనే సగం కేసులు ఉంటున్నాయి.

 

Exit mobile version