NTV Telugu Site icon

Covid Cases : న్యూ ఇయర్​ సెలెబ్రేషన్స్ కోసం గోవాకి వెళుతున్నారా?

Newyearindia

Newyearindia

2023 మరి కొద్ది రోజుల్లో పూర్తి అవ్వబోతుంది.. కొత్త సంవత్సరం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఒకవైపు న్యూ ఇయర్ ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆతృత.. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు జనాలను భయాందోళనకు గురించి చేస్తుంది.. ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ కొత్త​ వేరియంట్​ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్​.1 సబ్​ వేరియంట్​ కేసులు ఉండగా, వాటిల్లో 34.. గోవాలోనే రికార్డ్​ అయ్యాయి.

మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 1 కేసు వెలుగులోకి వచ్చింది… ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నివేదికను రిలీజ్ చేసింది.. దేశంలో యాక్టివ్​ కొవిడ్​ కేసుల సంఖ్య 4,054గా ఉంది. వీటిల్లో.. కేరళోలనే అత్యధిక యాక్టివ్​ కేసులున్నాయి.. కోవిడ్ పరీక్షలను పెంచినట్లు తెలిపారు.. ఇప్పుడు రోజుకు 3 నుంచి 4 కేసులే వస్తున్నాయి. 1శాతం కన్నా తక్కువే ఇవి. జేఎన్​.1 కొవిడ్​ వేరియంట్​ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మాక్​ డ్రిల్స్​ నిర్వహించాము. అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంచి వెల్లడించారు..

రాష్ట్రాల వారీగా కోవిడ్ ఎలా ఉంది చూస్తే.. కర్ణాటకలో 125 కొవిడ్​ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 436గా ఉంది..

ఇక తెలంగాణాలో.. రాష్ట్రంలో 989 సాంపిల్స్​ని పరీక్షించగా వాటిల్లో 10 పాజిటివ్​ కేసులు వెలుగులోకి వచ్చింది. 8,40,392మంది కొవిడ్​ రోగులు రికవర్​ అయ్యారు..

అదే విధంగా మహారాష్ట్రలో చూస్తే.. 28 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 153కి పెరిగింది. రాష్ట్రంలో ఒమిక్రాన్​ ఎక్స్​బీబీ.1.16 వేరియంట్​ ప్రభావం అధికంగా కనిపిస్తోంది..

అయితే ఈ కొత్త వేరియంట్ జేఎన్​.1 తో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​ అభిప్రాయపడ్డారు.. కానీ ప్రజలు మాస్క్ లను ధరించడంతో పాటుగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు..