Site icon NTV Telugu

COVID 4th Wave: కొత్త వేరియంట్‌ లక్షణాలు ఇవే.. భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ స్టార్ట్‌ అయ్యిందా..?!

Covid 19

Covid 19

కరోనా మహమ్మారి భయం ఇంకా వీడడం లేదు.. రోజుకో రూపం మార్చుకుంటూ టెన్షన్‌ పెడుతోంది కరోనా వైరస్‌. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల థర్డ్‌ వేవ్‌ వచ్చింది. దేశంలో కొత్తగా రెండు ఎక్స్‌ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. జులై నాటికి ఎక్స్‌ఈ వేరియంట్‌ ద్వారా ఫోర్త్‌ వేవ్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. కాగా, ఎక్స్‌ఈ వేరియంట్‌ బారిన పడ్డ వాళ్లలో ఎక్కువ మందికి గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బలమైన రక్షణ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

Read Also: Covid 19: హస్తినను మళ్లీ కలవరపెడుతోన్న కరోనా.. అప్రమత్తమైన సర్కార్

మరోవైపు, దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు గురుగ్రామ్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్సీఆర్ ప్రాంతంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో… ఫోర్త్‌ వేవ్‌ ప్రారంభమైందని ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. గురుగ్రామ్‌ నగరంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు పెరిగింది. గురుగ్రామ్ నగరంలో కరోనా పాజిటివిటీ రేటు 8.5శాతం పెరిగింది. హర్యానా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో… సగానికి పైగా గురుగ్రామ్‌లోనే వెలుగుచూశాయి. దీంతో హర్యానా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి ఇకపై రాష్ట్ర బాధ్యత కాదని, వ్యక్తిగత వ్యక్తుల బాధ్యత అని అధికారులు తెలిపారు.

Exit mobile version