కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున టీకాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్, హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వారియర్స్‌కు టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తయారీ సంస్థలు బహిరంగ మార్కెట్ లోకి తీసుకొచ్చే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి ధరఖాస్తు చేసుకున్నాయి.
Read: కోవిడ్‌పై కొత్త మార్గదర్శకాలు… 3 నుంచి 5 రోజులలోపు…
ఈ ధరఖాస్తులను సీడీఎస్ఓసీఏ నిపుణులు పరిశీలించారు. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని డీసీజీఐకి నిపుణులు సూచించారు. దీనిపై త్వరలోనే డీసీజీఐ నిర్ణయం తీసుకోనున్నది. బహిరంగ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే ఎవరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే వాటిపై కూడా గైడ్‌లైన్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంటుంది.
