భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 211 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో.. 8,834 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది.. ఇక, కోవిడ్‌తో ప్రాణాలు విడిచినవారి సంఖ్య 4,73,537కు పెరగగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
భారత్ కోవిడ్ అప్‌డేట్.. ఇవాళ ఎన్నికేసులంటే..?
