భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరోసారి కరోనా మహమ్మారి బారినపడ్డారు.. స్వల్ప లక్షణాలు ఉండడంతో.. తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినిట్టు.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. కాగా, వెంకయ్యనాయుడుకి కరోనా సోకడం ఇది రెండోసారి.. గతంలోనూ ఓసారి కోవిడ్ బారినపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
Read Also: తొలి జాబితా విడుదల చేసిన కెప్టెన్.. ఆయన అక్కడి నుంచే బరిలోకి..