భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఇది కరోనా ఫోర్త్ వేవ్‌కు దారితీస్తుందా అనే ఆందోళనకు కూడా వ్యక్తం అవుతుంది.. అయితే, దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు నమోదయ్యాయి. సోమవారం రోజు ఏకంగా 90 శాతం పెరిగి 2 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య తగ్గింది.. నిన్నటితో పోల్చితే 43 శాతం తగ్గాయి కేసులు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,247 మంది కరోనా బారిన పడినట్టు నిర్ధారణైంది. అలాగే, ఒకే ఒక్క కరణా మరణం నమోదయ్యింది. ప్రస్తుతం దేశంలో 11,860 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత కొంత కాలం రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవూ వస్తున్నాయి. అయితే, నిన్న ఒక్క సారిగా రెండు వేలు దాటాయి. మొన్నటితో పోల్చితే నిన్న 90 శాతం పెరిగాయి రోజువారీ కేసులు. అలాగే, 214 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యింది. అయితే, మరో 24 గంటలు గడిచే సరికి మళ్లీ కేసులు దిగివచ్చాయి.
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతోందనే భయాలు కూడా వ్యక్తం అవుతుండగా.. ఇప్పట్లో ఫోర్త్ వేవ్ ఉండబోదని కాన్పూర్ ఐఐటీ నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: Loan App: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
